భారతదేశం, ఫిబ్రవరి 20 -- మచ్​ అవైటెడ్​, మోస్ట్​ యాంటిసిపేటెడ్​ అఫార్డిబుల్​ స్మార్ట్​ఫోన్​ని యాపిల్​ సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. దీని పేరు ఐఫోన్​ 16ఈ. ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 59,990గా ఫిక్స్​ చేసింది సంస్థ. ఇందులో పలు మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నప్పటికీ ఈ ప్రైజ్​ పాయింట్​ కాస్త ఎక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చాలా మంది.. తక్కువ ధరకు వచ్చే ఐఫోన్​ 16ఈ కన్నా ఐఫోన్​ 16 కొనాలని చూస్తున్నారు. బడ్జెట్​ కాస్త ఎక్కువ ఉన్న వారికి ఇది మంచి నిర్ణయం అవుతుందని టెక్​ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 16ఈతో పోల్చితే, ఐఫోన్​ 16 ఈ విషయాల్లో బెటర్​? ఇక్కడ తెలుసుకోండి..

అధికారిక లాంచ్ తరువాత టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది ఐఫోన్​ 16ఈ. ఈ ఫోన్ ధర సుమారు రూ.50,000 ఉంటుందని చాలా మంది ఆశించగా, యాపిల్ ఐఫోన్ 16ఈ ధరను చాలా ఎక్కువగా ( ర...