భారతదేశం, ఫిబ్రవరి 10 -- స్మాప్​చాట్​కి గట్టి పోటీని ఇచ్చే విధంగా ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం మెటా.. కొత్త యాప్​ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దాని పేరు "ఇన్​స్టంట్స్". వినియోగదారులు పంపిన ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే మాయమైపోయేలా (డిసప్పియర్​) ఈ ఇన్‌స్టాంట్స్ యాప్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం..

ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. మెటా ప్రస్తుతం ఈ ఇన్​స్టంట్స్​ యాప్‌కి సంబంధించిన అంతర్గత ప్రోటోటైప్‌పై పనిచేస్తోంది. ఫోటోలు పంపిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమయ్యేలా దీనిని రూపొందిస్తున్నారు. అయితే, ఈ యాప్ ప్రస్తుతం అంతర్గతంగా అభివృద్ధి దశలోనే ఉందని, ఇంకా ఎక్స్​టర్నల్​ టెస్టింగ్​ కోసం అందుబాటులోకి రాలేదని మెటా ప్రతినిధి స్పష్టం చేశారు.

దీని బట్టి చూస్తే, ఈ యాప్​ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అర్థం...