భారతదేశం, మార్చి 23 -- Indraja: సీఏం భార్య‌గా త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది ఇంద్ర‌జ‌. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో సీఏం పెళ్లాం పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్ , జయసుధ , సుమన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గడ్డం రమణా రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. "సీఎం పెళ్లాం మూవీ ప్రమోషనల్ సాంగ్‌ను ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో లాంఛ్ చేశారు.

ఈ సాంగ్ లాంఛ్ వేడుక‌లో ఇంద్ర‌జ మాట్లాడుతూ..."సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుంద‌న్ని ఆలోచ‌న‌ను రేకెత్తించేలా ద‌ర్శ‌కుడు ఈ మూవీలో ఆవిష్క‌రించారు. న‌వ్విస్తూనే ఆలోచింప‌జేసే సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌రి రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సినిమాలో క‌నిపిస్తాయి. ఇటీ...