భారతదేశం, ఫిబ్రవరి 23 -- టీ20 ప్రపంచకప్ 2026లో భారత అభిమానులకు షాకిస్తూ టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు ప్రమాదంలో పడ్డాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. దీనితో పాయింట్లు రాకపోవడమే కాదు, నెట్​ రన్​ రేట్​ కూడా దెబ్బతింది. ఫలితంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారత్ ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన 'డూ ఆర్ డై' పరిస్థితికి చేరుకుంది.

ఆదివారం జరిగిన మ్యాచ్​లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో రాణించగా, యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. భారత బౌలర్ల...