భారతదేశం, ఫిబ్రవరి 19 -- డిఫెండింగ్ ఛాంపియన్స్ గా టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన ఇండియా అంచనాలను అందుకుంటూ అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీని అజేయంగా ముగించింది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై విజయాలు సాధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) రాత్రి ముగిసిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన భారత్ తన అన్ బీటెన్ రన్ కంటిన్యూ చేసింది.

టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 చేరిన టీమ్స్ పై క్లారిటీ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక టీమ్స్ సూపర్ 8లో అడుగుపెట్టాయి. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిన మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించింది.

సూపర్ 8 చేరిన టీమ్స్ ను రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉ...