భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరు కోసం క్రికెట్ ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. కానీ వరుణుడు మాత్రం బిగ్ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ లో భాగంగా కొలంబోలో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాక్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. పొద్దున నుంచి మబ్బులు పట్టి ఉన్న కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ వర్షం ముప్పు మాత్రం తొలగిపోలేదు.

టీ20 ప్రపంచకప్ లో చాలా నాటకీయ పరిణామాల తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. మొదట ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ తర్వాత తోక ముడిచింది. అయితే ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఇప్పుడు కొలంబోలో సూర్యుడు వచ్చాడు. కానీ మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం 8 శాతం ఉందని ఆక్యూవెదర్ తెలిపింది. అలాగే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్...