భారతదేశం, మార్చి 2 -- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ షురూ అయింది. ఇప్పటికే సెమీఫైనల్‍కు ఇరు జట్లు క్వాలిఫై అయ్యాయి. ఈ మ్యాచ్‍తో సెమీస్ ప్రత్యర్థులు ఖరారు కానున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు (మార్చి 2) టీమిండియా, న్యూజిలాండ్ మధ్య గ్రూప్-ఏలో లాస్ట్ గ్రూప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.

తుదిజట్టులో టీమిండియా ఓ మార్పు చేసింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‍ల్లో గెలిచి సెమీస్‍కు అర్హత సాధించింది భారత్. ఈ చివరి గ్రూప్ మ్యాచ్‍లో వరుణ్‍ను తీసుకుంది. స్పిన్ బలాన్ని పెంచుకుంది. షమీ రూపంలో ఒకే రెగ్యులర్ పేసర్ ఉన్నాడు. కెప్...