భారతదేశం, జనవరి 11 -- దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా, ఇప్పుడు కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. నేడు (జనవరి 11) వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే క్రికెట్​ అనగానే ఇప్పుడు అందరి దృష్టి విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మలపైనే ఉంటోంది. టీ20, టెస్టులకు ఇద్దరు రిటైర్మెంట్​ ప్రకటించడంతో తమ ఫేవరెట్​​ ప్లేయర్లను కనీసం వన్డేల్లో అయినా చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సిరీస్​ కేవలం మూడు వన్డేలే ఉండటంతో వీరిద్దరు రాణించాలని ఫ్యాన్స్​ భావిస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్​లో కోహ్లీ, రోహిత్​ పలువురు దిగ్గజాల రికార్డులపై కన్నేశారు. అవి బ్రేక్​ అయితే ఫ్యాన్స్​కి పండగే!

ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ముందు అనేక రికార్డులు నిలబడ్డాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన...