భారతదేశం, మార్చి 30 -- మనుషులు పెళ్లి చేసుకునే ముందు చాలా విధాలుగా కంపాటబులిటీని టెస్ట్​ చేసుకుంటారు. వీటిల్లో కొన్ని సీరియస్​గా, ఇంకొన్ని సింపుల్​గా, ఫన్నీగా ఉంటాయి. అయితే, వ్యాపారవేత్త- రచయిత సాహిల్ బ్లూమ్ మాత్రం కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి ఒక టెస్ట్​ సిఫార్సు చేశారు. అదే 'ఐకియా మ్యారేజ్​ టెస్ట్​'! దీంతో మీరు మీ పార్ట్​నర్​, మీకు సెట్​ అవుతారా? లేదా? అనేది తెలుసుకోవచ్చట.

ఈ ఐకియా టెస్ట్​ సరళంగా ఉంటుంది. న్యూయార్క్ టైమ్స్ 'ది 5 టైప్స్ ఆఫ్ వెల్త్' పుస్తక రచయిత సాహిల్ బ్లూమ్ ప్రకారం.. పెళ్లికి ముందు జంటలు ఐకియాకు వెళ్లి, ఫర్నిచర్ పీసెస్​ని కొనుగోలు చేసి, వాటిని కలిసి ఫిక్స్​ చేయాలి. అంతే!

'ఎలాంటి గొడవలు లేకుండా, కలిసిగట్టుగా మీరు ఫర్నీచర్​ పీసెస్​ని సక్సెస్​ఫుల్​గా అమర్చగలిగితే, మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ!' అని సాహిల్​ బ్లూమ్​ చె...