తెలంగాణ,హైదరాబాద్,రంగారెడ్డి, జనవరి 25 -- పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేత‌లు జరగాయి. దివ్యన‌గ‌ర్ లేఔట్ ప్లాట్ ఓన‌ర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయమే ఈ కూల్చివేతలను ప్రారంభించారు.

ప‌లు కాల‌నీల‌కు, నివాస ప్రాంతాల‌కు వెళ్లేందుకు అవ‌కాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీ గోడను పూర్తిగా తొల‌గించారు. ప్ర‌హ‌రీ కూల్చివేత‌తో దివ్య‌న‌గ‌ర్ లేఔట్ ప్లాట్ య‌జ‌మానులు, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఇత‌ర లే ఔట్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.

దివ్య‌న‌గ‌ర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీ కూల్చివేత‌తో పలు కాలనీలకు రూట్ క్లియర్ అయింది. ఇందులో ఏక‌శిలా లే ఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, సుప్ర‌...