భారతదేశం, సెప్టెంబర్ 6 -- హైదరాబాద్‌లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు భారీ వేతనాలు ఉన్న నిపుణులకు కూడా సవాలు విసురుతున్నాయి! నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన భార్యతో కలిసి ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ఇటీవలే సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ రెడ్డిట్​లో పోస్ట్ చేశారు. పెరుగుతున్న గృహాల ధరలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, అద్దెకు ఉండాలా లేక ఇల్లు కొనాలా అనే సంక్లిష్ట నిర్ణయంపై యువ జంటలు ఎంతగా సతమతమవుతున్నారో ఆయన పోస్ట్ స్పష్టం చేసింది. "మనసు చెప్పిన మాట వినాలా లేక ఫ్యాక్ట్స్​ చెప్పే గణాంకాలకు కట్టుబడి ఉండాలా అనే పోరాటం," అని ఆయన పేర్కొన్నారు.

30 ఏళ్ల వయసులో ఉన్న సదరు ఐటీ ఉద్యోగి, తాను, తన భార్య కలిసి నెలకు రూ. 4 లక్షలకు పైగా సంపాదిస్తున్నామని చెప్పారు. త్వరలో కుటుంబాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు కూడా తెలిపారు.

"ప్రస్తుతం, 2,000 చదరపు అ...