భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రేమ పేరుతో జరిగే మోసాలే కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలలోనూ మోసాలు చేస్తున్నారంట..! ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉన్నాయని నగర పోలీసులు చెబుతున్నారు షీ టీమ్స్ కు కూడా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ఇదే విషయంపై హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

"హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి" అని సీపీ సజ్జనార్ తెలిపారు.

ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే...