భారతదేశం, మార్చి 18 -- బల్దియా, హెచ్​ఎండీఏ తరహాలో ఫ్యూచర్​సిటీ అభివృద్ధి కోసం.. ఫ్యూచర్ ​సిటీ డెవలప్​మెంట్​ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించనున్నారు. ఇది శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది. సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి.. సిటీగా ఫ్యూచర్​సిటీని డెవలప్​చేయాలని నిర్ణయించి అథారిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ప్లాన్​ ప్రకారం డెవలప్​చేయనున్నారు. దీంతో ఏయే ప్రాంతాలు ఇందులో కలుస్తాయన్న అంశంపై అంతా ఆసక్తి నెలకొన్నది.

2.ఎఫ్​సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్​ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా.. ఔటర్​ రింగ్​ రోడ్​ అవతల, శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్​ స్టేట్​ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడ...