భారతదేశం, ఆగస్టు 30 -- వీకెండ్​ ట్రిప్​కి హైదరాబాద్​ శివారులో బీచ్​కి వెళ్లేందుకు రెడీ ఆ? హైదరాబాద్​లో సముద్రమే లేదు, మరి బీచ్​ ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నగర శివారులోని కొత్వాల్​గూడలో కృత్రిమ బీచ్​ని తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్​ అయ్యింది. 35ఎకరాల్లో, మొత్తం రూ.225కోట్లతో ఈ ఆర్టిఫీషియల్​ బీచ్​ ప్రాజెక్ట్​ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్మించనున్నారు. డిసెంబర్ నెలలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ మీడియా కథనం వెల్లడించింది. కేవలం బీచ్‌గానే కాకుండా.. కుటుంబాలు వినోదం, అడ్వెంచర్ కోసం ఒకే చోట వారాంతాలు గడిపేలా ఇది ఒక సమగ్ర గమ్యస్థానంగా రూపుదిద్దుకోనుంది.

ఈ కృత్రిమ బీచ్‌ను ఒక మల్టీ-సెన్సరీ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేస్తున్న...