భారతదేశం, ఫిబ్రవరి 12 -- మాధాపూర్‌ హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ను గురువారం నిర్వ‌హించింది. వంద‌లాది తాత్కాలిక షెడ్డుల‌ను, ప‌దుల సంఖ్య‌లో ఉన్న షాపుల‌ను తొల‌గించింది. మొండి కుంట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.

చెరువుతో పాటు.. ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 2200 ల కోట్ల ప్ర‌భుత్వ ఆస్తిని హైడ్రా ర‌క్షించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ గ్రామంలో గురువారం ఈ మేజ‌ర్ ఆప‌రేష‌న్ హైడ్రా చేసింది.

స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట‌తో పాటు.. స‌ర్వే నంబ‌రు 55లోని ప్ర‌భుత్వ భూమి ఎక‌రాల‌కొద్దీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌మేర‌కు రెవ...