భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. లాయర్ ఇజ్రాయిల్ మృతిచెందారు. ఓ మహిళను వేధిస్తున్న ఘటనలో దస్తగిరిపై లాయర్ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్ సంతోష్‌నగర్ పరిధిలోని న్యూ మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ మహిళను.. దస్తగిరి అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ ఇజ్రాయిల్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తారా అని.. కక్ష గట్టిన దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు....