భారతదేశం, జనవరి 28 -- HYD Accident: హైదరాబాద్‌ బహదూర్‌పూర్ -ఆరాంఘర్‌ మధ్య ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కొత్త ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మైనర్లు బైక్‌పై వెళుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతి చెందారు.

బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు వెళుతుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్‌ పిల్లర్ నంబర్ 43 సమీపంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న యువకులు రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఆ తర్వాత డివైడర్‌ ను తాకుతూ కింద పడిపోయారు. ఈ ఘటనలో ఖాద్రి , అహ్మద్ స్పాట్‌లో చనిపోయారు. సయ్యద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

15ఏళ్లలోపు పిల్లలకు బైక్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వివరించారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒ...