భారతదేశం, మార్చి 9 -- తైవాన్ టెక్ కంపెనీ హెచ్‌టీసీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పేరు హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఈ5 ప్లస్. వియత్నాంలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. గ్రే, బ్లూ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర సుమారు రూ.8వేల పైన ఉంటుంది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం. ఈ హెచ్‌టీసీ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో సహా అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌టీసీ వైల్డ్ ఫైర్ ఈ5 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

ఈ ఫోన్‌లో హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.745 అంగుళాల డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. మైక్రో ఎస్డీ కార్...