భారతదేశం, ఏప్రిల్ 5 -- టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వార్ 2 చిత్రం రూపొందుతోంది. ఆ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాతోనే డైరెక్ట్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ స్పై యాక్షన్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్.
తన ఫేవరెట్ కో-స్టార్ ఎవరో చెప్పాలని ఓ ఈవెంట్లో హృతిక్ రోషన్‌కు ప్రశ్న ఎదురైంది. టక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేశారు హృతిక్. "జూనియర్ ఎన్టీఆర్.. నా ఫేవరెట్ కో-స్టార్. అతడు ఓ అద్భుతం. మంచి టీమ్మేట్. గొప్ప వ్యక్తి. ఆ మూవీని మీరు చూసేందుకు నేను వేచిచూడలేకున్నా" అని హృతిక్ ప్రశంసలు కురిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.