భారతదేశం, ఏప్రిల్ 5 -- టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వార్ 2 చిత్రం రూపొందుతోంది. ఆ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాతోనే డైరెక్ట్ బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ స్పై యాక్షన్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‍లో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్.

తన ఫేవరెట్ కో-స్టార్ ఎవరో చెప్పాలని ఓ ఈవెంట్‍లో హృతిక్ రోషన్‍కు ప్రశ్న ఎదురైంది. టక్కున జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేశారు హృతిక్. "జూనియర్ ఎన్టీఆర్.. నా ఫేవరెట్ కో-స్టార్. అతడు ఓ అద్భుతం. మంచి టీమ్‍మేట్. గొప్ప వ్యక్తి. ఆ మూవీని మీరు చూసేందుకు నేను వేచిచూడలేకున్నా" అని హృతిక్ ప్రశంసలు కురిపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు...