భారతదేశం, ఫిబ్రవరి 4 -- Horror OTT: గ‌త ఏడాది త‌మిళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది బ్లాక్ మూవీ. జీవా, ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వ‌చ్చింది. డార్క్ పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ మూవీకి కేజీ బాల‌సుబ్ర‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో త‌మిళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు హార‌ర్‌, సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు డార్క్ మూవీని తెర‌కెక్కించాడు. స్టోరీ, ట్విస్ట్‌ల‌తో పాటు జీవా యాక్టింగ్ బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. ఈ సినిమా క‌థ మొత్తం జీవా, ప్రియా భ‌వానీ శంక‌ర్ క్యారెక్ట...