భారతదేశం, ఫిబ్రవరి 5 -- జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2024 డిసెంబర్‌లో ప్రకటించిన నిస్సాన్, హోండా మధ్య విలీనం ప్రతిపాదన ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. హోండా విలీన ప్రతిపాదనను తిరస్కరించాలని నిస్సాన్ బోర్డు యోచిస్తుందా? ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

నిస్సాన్‌ను హోండా అనుబంధ సంస్థగా మార్చాలన్న హోండా ప్రతిపాదనను తిరస్కరించవచ్చని నిస్సాన్ సూచించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే రెండు సంస్థల మధ్య విలీన చర్చలు ఇక క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. బుధవారం నిస్సాన్ బోర్డు సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.

హోండా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 47 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది నిస్సాన్ విలువకు 5 రెట్లు ఎక్కువ. ఈ కారణంగా విలీనం కింద హోండా.. నిస్సాన్ వాటాలను కొనుగోలు...