భారతదేశం, ఏప్రిల్ 15 -- క్యాంపస్ నిరసనలపై విశ్వవిద్యాలయం తమ డిమాండ్లను ధిక్కరించడంతో హార్వర్డ్​కు 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను వైట్​హౌస్ తాజాగా స్తంభింపజేసింది! అంతేకాదు, క్యాంపస్ యాక్టివిజాన్ని అరికట్టాలనే డిమాండ్లను పాటించబోమని హార్వర్డ్​ తేల్చిచెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ దిగ్గజ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను నిలిపివేసింది.

"మెరిట్-ఆధారిత" ప్రవేశాలు, నియామక పద్ధతులను అవలంబించడం, వైవిధ్యంపై విద్యార్థులు, అధ్యాపకులు, నాయకత్వ అభిప్రాయాలపై ఆడిట్ నిర్వహించడం, ఫేస్ మాస్క్​లను నిషేధించడం వంటి విస్తృత మార్పులను అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన విభాగం హార్వర్డ్​కి శుక్రవారం పంపిన లేఖలో డిమాండ్​ చేసింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ డిమాండ్లు చేసిందని వార...