భారతదేశం, సెప్టెంబర్ 20 -- హెచ్​1బీ వీసా ఫీజును అత్యంత భారీగా (1లక్ష డాలర్లు) పెంచుతూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ ఆదేశాల ప్రకారం.. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు లక్ష డాలర్ల రుసుము చెల్లించకపోతే.. "ప్రత్యేక వృత్తులలో" పనిచేసే విదేశీయుల అమెరికా ప్రవేశంపై పరిమితులు విధిస్తారు.హెచ్​1బీ వీసా ఫీజు కింది లక్ష డాలర్లను వసూలు చేస్తారు. ఇది సెప్టెంబర్​ 21న అమల్లోకి వస్తుంది. దీని వల్ల వలస న్యాయవాదులు, ఉద్యోగులు.. హెచ్1బీ వీసా హోల్డర్లను విదేశాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని ఆదేశిస్తున్నాయి. లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ప్రముఖ న్...