భారతదేశం, మార్చి 25 -- 2026 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్​వై 2026) ఇనీషియల్​ హెచ్ -1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చ్ 24తో​ అధికారికంగా ముగిసింది. నెక్ట్స్​ ఏంటి? అన్నది ఇప్పుడు హెచ్​1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఉన్న అతిపెద్ద ప్రశ్న.

రిజిస్ట్రేషన్ల సంఖ్య వార్షిక పరిమితిని మించితే, వీసా గ్రహితలను రాండమ్​గా ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అమలు చేస్తుంది యూఎస్ సిటిజన్​షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) లాటరీ ఫలితాలను సాధారణంగా మార్చ్​ చివరిలో లేదా ఏప్రిల్ మొదట్లో ప్రకటిస్తారు.

ఎంపికైన వారికి సంబంధించి, ఏప్రిల్ 1, 2025 నుంచి పూర్తి హెచ్-1బీ పిటిషన్లు ఎంప్లాయర్లు దాఖలు చేయవచ్చు. ఫైలింగ్ వ్యవధి సాధారణంగా సెలక్షన్​ నోటిఫికేషన్ తేదీ నుంచి 90 రోజులు ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2025 వరకు నడుస్తుంది. ...