భారతదేశం, మార్చి 19 -- Guntur Robbery : గుంటూరు జిల్లాలో విచిత్రమైన దొంగ‌త‌నం చోటు చేసుకుంది. ప్రేమించిన యువ‌కుడితో పెళ్లికి త‌ల్లిదండ్రులు నిరాక‌రించారు. దీంతో పెళ్లి కోసం త‌ల్లిదండ్రులు చేయించిన బంగారు ఆభ‌రణాల‌ను ప్రియుడితోనే యువ‌తి దొంగ‌త‌నం చేయించింది. ఆ బంగారు ఆభ‌ర‌ణాల విలువ ఏకంగా రూ.90 ల‌క్షలు. పోలీసుల విచార‌ణలో కుమార్తె దొంగ‌త‌నం చేయించిన‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ఆ ప్రేమికుడు పరారీలో ఉన్నాడు.

ఈ ఘ‌ట‌న గుంటూరు న‌గ‌రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం... ఇటీవ‌లి గుంటూరు న‌గరంలో సుమారు రూ.90 ల‌క్షల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ జ‌రిగింది. ఆ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగ‌త‌నం కేసు న‌మోదు చేసిన పోలీసులు రంగంలో దిగారు. న‌గ‌రంలో దొంగ‌ల ముఠాల‌పై దృష్టి పెట్టి ద‌ర్యాప్తు చేశారు. అయితే ఎటువంటి ప్రయోజ‌నం లే...