భారతదేశం, మార్చి 8 -- ఈ ఘ‌ట‌న గుంటూరు ప‌ట్ట‌ణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో శుక్ర‌వారం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి మండ‌లానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఒక ప్రైవేటు జూనియ‌ర్ కాలేజీ హాస్ట‌ల్లో ఉండి ఇంట‌ర్మీడియ‌ట్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. మార్చి 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కాలేజీ ఎగ్జామ్ సెంట‌ర్‌లో ఆ విద్యార్థిని ప‌రీక్ష‌లు రాస్తోంది. అదే ప‌రీక్షా కేంద్రంలో ఎంబీఏ చ‌దువుతున్న యువ‌కుడిని ఇన్విజిలేట‌ర్‌గా నియ‌మించారు.

ప్రభుత్వ అధ్య‌ాప‌కులు అందుబాటులో లేక‌పోవ‌డంతోనే ఎంబీఏ చ‌దివే యువ‌కుడిని ఇన్విజిలేట‌ర్‌గా నియమించారు. విద్యార్థిని ప‌రీక్ష రాస్తున్న రూమ్‌కు ఆ యువ‌కుడు ఇన్విజిలేట‌ర్‌గా వ్య‌వ‌హరించాడు. ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఆమెతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఫోన్ నెంబ‌ర్ ఇవ్వాలంటూ వేధింపుల‌కు...