భారతదేశం, ఫిబ్రవరి 22 -- Gunde Ninda Gudi Gantalu: మీనాను త‌న ఫ్యామిలీ ఓ ప‌నిమ‌నిషిలా ట్రీట్ చేయ‌డం బాలు స‌హించ‌లేక‌పోతాడు. మీనా చేత పూల కొట్టు పెట్టిస్తాడు. ఆ షాప్‌ను శృతి చేత ఓపెన్ చేయిస్తాడు. పూల దుకాణం పెట్టాల‌నే ఆలోచ‌నకు కార‌ణం శృతినే అని బాలు అంటాడు. రిబ్బ‌న్ క‌ట్ చేసిన శృతికి మీనా చేతుల మీదుగా క‌వ‌ర్ అంద‌జేస్తాడు బాలు. షాప్ ఓ పెనింగ్ చేసినందుకు రెండు వేల ఐదు వంద‌లు ఇస్తున్నాన‌ని అంటాడు.

శృతికి డ‌బ్బులు ఇవ్వ‌డానికి మీనా సంకోచిస్తుంది. ప‌ని చేసినందుకు నీకు ఇచ్చిన‌ప్పుడు...నువ్వు కూడా శృతికి ఇవ్వాల‌ని బాలు అంటాడు. శృతి డ‌బ్బు వ‌ద్ద‌ని అంటుంది. కానీ స‌త్యం ఆ డ‌బ్బు తీసుకోమ‌ని అన‌డంతో కోపంగా మీనా చేతిలోని క‌వ‌ర్ అందుకుంటుంది శృతి.

బ‌ట్ట‌లు ఉతికినందుకు మీనాకు తాను రెండు వేలు ఇచ్చినందుకు ప్ర‌తీకారంగా త‌న‌తో బాలు షాప్ ఓపెన్ చేయించాడ‌ని శ...