భారతదేశం, ఏప్రిల్ 13 -- బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటికేే విపరీతంగా పెరిగాయి. దేశీయ స్పాట్ గోల్డ్ ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 23 శాతం వృద్ధిచెందాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే పసిడి ధర 5 శాతం పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్టు గత శుక్రవారం (ఏప్రిల్ 11) 10 గ్రాములకు రూ .93,940 వద్ద ఆల్- టైమ్ గరిష్టాన్ని తాకింది. చివరకు 10 గ్రాములకు 0.15 శాతం పెరిగి రూ.93,887 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పసిడి ధరలు కూడా బలమైన లాభాలను చూశాయి. కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి 3,254.90 డాలర్ల వద్ద ముగిసింది. మరి నెక్ట్స్​ ఏంటి? గోల్డ్​ ప్రైజ్​ పడుతుందా? లేక పెరుగుతుందాయ నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు ఈ ఏడాది ఇంతలా పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. వాటిల్లో అతిపెద్దది వాణిజ్య యుద్ధంపై ఆందోళనలు! ట్రేడ్ వార్ భయాలు బంగారం ధరలకు ఊతమిస్తున్నాయి. అ...