భారతదేశం, ఫిబ్రవరి 25 -- మీరు జీమెయిల్ ఉపయోగిస్తుంటే గూగుల్ చేస్తున్న కొత్త మార్పులను మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానికి.. గూగుల్ జీమెయిల్ కోసం ఎస్ఎంఎస్ ఆధారిత 6-అంకెల అథెంటికేషన్ కోడ్‌లను తొలగిస్తోంది. దీనికి బదులుగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్(2ఎఫ్ఏ) కోసం గూగుల్ క్యూఆర్ కోడ్లను ఎంచుకుంటోంది. జీమెయిల్ ఖాతాను మరింత భద్రపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

జీమెయిల్ ప్రతినిధి రాస్ రిచెండ్‌ఫెర్ ప్రకారం, రాబోయే నెలల్లో ఈ మార్పు అమలు అవుతుందని భావిస్తున్నారు. ఇది ఎస్ఎంఎస్ ధృవీకరణతో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారు గుర్తింపు ధృవీకరించడానికి జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలంటే మీ నెంబర్ ఎంటర్ చేసి 6 అంకెల కోడ్‌ను రిసీవ్ చేసుకోవడానికి బదులుగా మీ ఫోన్ కెమెరా యాప్‌తో స్కాన్ చేయాల...