భారతదేశం, అక్టోబర్ 27 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్కెట్‌లో గూగుల్ జెమినీ గత కొన్ని నెలలుగా పట్టు సాధిస్తోంది. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన 'నానో బనానా' మోడల్ వంటి వివిధ మోడళ్లను విడుదల చేసింది. ఈ మోడల్​తో ప్రజలు తమకు నచ్చిన విధంగా ఏఐ ఇమేజ్​లు క్రియేట్​ చేసుకుని సోషల్​ మీడియాను షేక్​ చేశారు. ఇక ఇప్పుడు గూగుల్ తమ ఏఐ అసిస్టెంట్‌కు మరో ఆసక్తికరమైన సామర్థ్యాన్ని జోడిస్తోంది!

ఇకపై, జెమినీ ఏఐ టూల్ ద్వారా వినియోగదారులు కేవలం కొన్ని సెకన్లలోనే ప్రెజెంటేషన్లు తయారు చేయగలుగుతారు. ఇందుకోసం 'క్యాన్వాస్' టూల్‌ను ఉపయోగిస్తుంది. 'క్యాన్వాస్' టూల్ కొంత కాలంగా జెమినీ యాప్‌లో భాగమైనప్పటికీ, ప్రెజెంటేషన్లను సృష్టించే ఈ కొత్త ఫీచర్ ఇప్పుడే వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు ఒక రీసెర్చ్ పేపర్ లేదా మర...