భారతదేశం, సెప్టెంబర్ 30 -- గాజాలో రెండేళ్లుగా జరుగుతున్న మారణహోమానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ గాజా శాంతి ప్రణాళికను తాజాగా ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఈ శాంతి ప్రతిపాదనను అంగీకరించింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైట్‌హౌస్‌ను సందర్శించిన సందర్భంగా ఈ ప్రణాళికను విడుదల చేశారు.

ఈ ప్రతిపాదనలో గాజాలో వెంటనే కాల్పుల విరమణ, పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ, బందీల విడుదల, పాలస్తీనా భూభాగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గసూచీ వంటివి ఉన్నాయి.

ట్రంప్ ప్రవేశపెట్టిన 20-పాయింట్ల ప్రతిపాదన ప్రకారం..

ఇరు పక్షాల అంగీకారంతో, గాజాలో యుద్ధం తక్షణమే ముగుస్తుంది.

ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించుకుంటుంది.

హమాస్ వద్ద ఉన్న చివరి బందీలను 72 గంటల్లో విడుదల చేయాలి.

వైట్‌హౌస్ ప్రతిపాదించ...