భారతదేశం, ఆగస్టు 4 -- గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2025కి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభంకానుంది. iitr.ac.in లో గేట్​ 2025 రిజిస్ట్రేషన్​ మొదలవుతుంది. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ విండో సెప్టెంబర్​ 26 వరకు తెరిచి ఉంటుంది. ఈ దఫా పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది.

నోటిఫికేషన్ ప్రకారం, గేట్​ 2025 పొడిగించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ / దరఖాస్తు ప్రక్రియ (ఆలస్య రుసుముతో) చివరి తేదీ అక్టోబర్ 7, 2024 అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో రెండు షిఫ్టుల్లో (ఉదయం, మధ్యాహ్నం) గేట్​ 2025 పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు, రెండొవ షిఫ్ట్ (మధ్యాహ్నం షిఫ్ట్) మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు ము...