భారతదేశం, మార్చి 22 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీని భారీ బడ్జెట్‍తో నిర్మించారు దిల్‍రాజు, శిరీష్. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, దిల్‍రాజు ఏ ప్రెస్‍మీట్‍కు వెళ్లినా గేమ్ ఛేంజర్ చిత్రం గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

మలయాళ స్టార్ హీరో మోహన్‍లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్ 2 (ఎల్2): ఎంపురాన్ తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్ నేడు (మార్చి 22) జరుగగా.. అదే రిపీట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‍రాజు ప్రెస్‍మీట్‍కు రాగా.. గేమ్ ఛేంజర్ ప్రస్తావన వచ్చింది. ఈ ప్రెస్‍మీట్‍లో మోహన్‍లాల్, పృథ్విరాజ్ కూడా పాల్గొన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో ఒ...