భారతదేశం, నవంబర్ 29 -- FIFA World Cup 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో గ్రూప్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. మరో నాలుగో రోజుల్లో రౌండ్-16 మ్యాచ్‌లు ఆరంభం కానున్న దశలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు గ్రూప్-ఏ జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ గ్రూపులో ఆతిథ్యమిస్తున్న ఖతర్ సహా నెదర్లాండ్స్, ఈక్వెడార్, సెనెగల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ టాపర్‌గా నెదర్లాండ్స్ ఉండగా.. చివరి స్థానంలో ఉన్న ఖతర్ రౌండ్ ఆఫ్ 16 ఆశలపై నీళ్లు చల్లుకుంది.

గ్రూప్-ఏలో నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు కూడా రాత్రి 8.30కే ప్రారంభం కానుండటం గమనార్హం.

ఈక్వెండార్-సెనెగల్.. మధ్య ఖలీపా ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ జరగ...