భారతదేశం, ఫిబ్రవరి 27 -- FCI Stipend: క్రీడాకారులకు నెలనెల స్టైఫెండ్‌ మంజూరు చేసేందుకు ఫుడ్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మార్చి 16 వ‌ర‌కు గడువు ఉంది. ఎఫ్‌సీఐ ఇచ్చే ఈ స్టైఫండ్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

15-24 మ‌ధ్య వ‌య‌సున్న క్రీడాకారులకు 2025-26 సంవ‌త్స‌రానికి ఎఫ్‌సీఐ ఈ స్టైఫండ్‌ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారుల‌కు జాతీయ స్థాయి క్రీడ‌ల్లో జూనియ‌ర్‌, స‌బ్ జూనియ‌ర్ విభాగాల్లో ఆడిన‌వారు, రాష్ట్ర స్థాయి క్రీడ‌ల్లో జూనియ‌ర్, స‌బ్ జూనియ‌ర్‌ విభాగాల్లో ఆడిన‌వారు, జాతీయ స్కూల్ గేమ్స్‌, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఆడిన‌వారు అర్హులు.

అలాగే 18-24 ఏళ్ల క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడ‌ల్లో సీనియ‌ర్, ఇండియ‌న్ యూనివ‌ర్శిటీ క్రీడ‌ల్లో ఆడిన‌వారు, రాష్ట్రస్థాయి క్రీడ‌...