భారతదేశం, మార్చి 22 -- Fantasy OTT: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఓరి దేవుడా మూవీ ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఈ రొమాంటిక్ కామెడీ ఫాంట‌సీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం.

విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఓరి దేవుడా మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ పాత్ర‌లో న‌టించాడు. ఈ మూవీలో విశ్వ‌క్‌సేన్‌కు జోడీగా మిథిలా పాల్క‌ర్‌, ఆశా భ‌ట్ హీరోయిన్లుగా క‌నిపించారు. ఓరి దేవుడా సినిమాకు డ్రాగ‌న్ ఫేమ్ అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఓ మై క‌డ‌వులే ఆధారంగా ఓరి దేవుడా మూవీ తెర‌కెక్కింది. త‌మిళ...