తెలంగాణ,హైదరాబాద్, జనవరి 24 -- మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య రచించిన "Obtuse Angle" కార్టూన్ల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ సాహిత్య మహోత్సవంలో భాగంగా "డీకోడింగ్ గవర్నెన్స్‌ ' సెషన్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సెషన్‌నుఅవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ డాక్టర్ దినేశ్ శర్మ నిర్వహించారు. డాక్టర్ సత్య మహంతి ఈ చర్చలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అనేకమంది మాజీ సివిల్ సర్వెంట్లతో పాటు పుస్తక ప్రియులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య కార్టూన్లను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా మంది పుస్తక ప్రియులు కార్డున్లను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య తన పుస్తకంపై సంతకం చేసి. విక్రయానికి అందుబాటులో ఉంచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహోత్సవాన్ని ప్రారంభించగా.. తొలి రోజున 20 వేలకుపైగా పుస...