భారతదేశం, మార్చి 28 -- జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే ఎన్​కౌండర్​లో ముగ్గురు పోలీసులు కూడా మరణించారని సమాచారం.

జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్తంగా జరిపిన ఎన్​కౌంటర్​లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సహా మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అయితే, శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మరింత సమాచారం అందుతుందని అధికారులు చెప్పారు.

పాకిస్థాన్​ ఆధారిత జైషే మహమ్మద్ (జేఈఎం) సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న ఉగ్రవాదులపై జమ్ముకశ్మీర్ పోలీసుల నేతృత్వంలో ముమ్మర ఆపరేషన్ల మధ్య గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.

రాజ్​బాగ్​లోని ఘ...