భారతదేశం, మార్చి 29 -- తన ఎక్స్​ (ట్విట్టర్)ని టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్​ అమ్మేశారు. అయితే అది మరొకరికి కాదు! తన సొంత ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) కంపెనీ అయిన ఎక్స్​ ఏఐ (xAI)కి విక్రయించారు మస్క్​. ఆల్​ స్టాక్​ డీల్​లో భాగంగా ఎక్స్​ని 33 బిలియన్​ డాలర్లకు అమ్మేసినట్టు మస్క్​ ప్రకటించారు.

"ఎక్స్ఏఐ, ఎక్స్ ఫ్యూచర్​ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంది. డేటా, మోడల్స్, కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్​ని కలపడానికి మేము ఈ రోజు అధికారికంగా చర్య తీసుకుంటాము," అని మస్క్ గతంలో ట్విట్టర్​గా పిలిచే ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

ఎక్స్​ఏఐ- ఎక్స్​ కోసం 45 బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఇది 2022లో మస్క్ చెల్లించిన దానికంటే కొంచెం ఎక్కువ. కానీ కొత్త ఒప్పందంలో 12 బిలియన్ డాలర్ల రుణం ఉంది.

ఈ చర్య "ఎక్స్ఎఐ అధునాతన ఏఐ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఎక్స్​కి చెంద...