భారతదేశం, సెప్టెంబర్ 6 -- అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కి 1 ట్రిలియన్​ డాలర్ల పే ప్యాకేజ్​ని ఆఫర్​ చేసి ప్రపంచాన్ని షాక్​కి గురిచేసింది టెస్లా బోర్డు! అయితే, ఇది పైకి కేవలం డబ్బు, మరింత నియంత్రణగా కనిపించినా.. టెస్లా బోర్డు నిజానికి షేర్‌హోల్డర్లను ఒక పెద్ద సవాలును ఆమోదించమని కోరుతోంది. అదే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను నిజంగా ప్రేరేపించేగలిగే ఒక అసాధారణ లక్ష్యం!

శుక్రవారం పెట్టుబడిదారులకు పంపిన ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం, ఈ డీల్ పూర్తిస్థాయిలో అందుకోవాలంటే టెస్లా మార్కెట్ విలువ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్​వీడియా కంటే రెండు రెట్లు ఎక్కువ పెరగాలి. అలాగే, టెస్లాను ఇప్పుడున్న ఇంధన సంస్థ నుంచి రోబోటిక్స్‌పై దృష్టి పెట్టే కంపెనీగా మస్క్ పూర్తిగా మార్చాలి.

ఈ కోణంలో చూస్తే, ఈ ప్యాకేజీ కేవలం ఒక జీతభత్యాల ప్రణాళిక మాత్రమే...