భారతదేశం, మార్చి 14 -- ఇండియన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మార్కెట్​లో ప్రజలకు మరొక ఆప్షన్​ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సింపుల్​ వన్​ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​. సింపుల్ ఎనర్జీ లైనప్​లో ఈ ఈ-స్కూటర్​ అత్యంత సరసమైన ఆఫర్​గా నిలిచింది. ఈ మోడల్​.. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన ఏథర్ 450ఎస్​కు గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సింపుల్ వన్​ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​ 3.7 కిలోవాట్ల ఫిక్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ని పొందుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఇదే సంస్థకు చెందిన మునుపటి డాట్ వన్ మోడల్​తో పోలిస్తే ఇది 21 కిలోమీటర్లు అధికం! అదనంగా, వన్ఎస్ ఫాస్ట్ ఛార్జింగ్​ని పొందుతుంది. ఇది రోజ...