భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు కొదవే లేదు! కొత్త కొత్త మోడల్స్​ కస్టమర్స్​ని పలకరిస్తున్నాయి. అలాంటి ఈ-స్కూటర్స్​లో ఒకటి వీఎల్​ఎఫ్​ టెన్నిస్​ 1500 వాట్​. గతేడాది లాంచ్​ అయిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్టైల్​తో పాటు చక్కటి రేంజ్​ కెపాసిటీని కలిగి ఉంది. కొత్తగా ఒక ఈ-స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఈ మోడల్​ మంచి ఆప్షన్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వీఎల్​ఎఫ్​ టెన్నిస్​ 1500 వాట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గతేడాది తొలినాళ్లల్లో ఈ విలోసిఫెరో (వీఎల్​ఎఫ్​) అనే ఇటాలియన్​ ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సంస్థ ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో అడుగుపెట్టింది. ప్రొడక్షన్​, సేల్స్​ కోసం కేఏడబ్ల్యూ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అనే...