భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఇండియాన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ 2 వీలర్​ సెగ్మెంట్​లో చాలా ప్రాడక్ట్స్​ ఉన్నాయి. వాటిల్లో ఒకటి యాంపియర్​ నెక్సస్​. ఈ ఈ-స్కూటర్​ స్టైలిష్​గా ఉంటుంది. పైగా లాంగ్​ రేంజ్​ని కూడా కలిగి ఉంది. ఈ మోడల్ ఒక హై పర్ఫార్మింగ్​ ఫ్యామిలీ స్కూటర్​ అని సంస్థ చెబుతోంది. కొత్తగా ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారు ఈ యాంపియర్​ నెక్సస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఆప్షన్​గా పెట్టుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఈ యాంపియర్. ఈ యాంపియర్ నెక్సస్​లో 3 కిలోవాట్ల ఎల్​ఎఫ్​పీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఫుల్​ ఛార్జ్​ చేసేందుకు 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సింగిల్​ ఛ...