భారతదేశం, ఫిబ్రవరి 11 -- కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మార్కెట్​లో చాలా ఆప్షన్లే ఉన్నాయి. మీరు బడ్జెట్​ ఫ్రెండ్లీ ఈ-స్కూటర్​లను చూస్తే మాత్రం ఓలా ఎలక్ట్రిక్​, యాంపియర్​ ఈవీ సంస్థ ప్రాడక్ట్స్​ మంచి ఆప్షన్​ అని ఆటోమొబైల్​ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఓలా ఎస్​1 ఎక్స్​, యాంపియర్​ మాగ్నస్​ నియో ఎలక్ట్రిక్​ స్కూటర్​లకు చక్కటి డిమాండ్​ కనిపిస్తోంది. వీటి మధ్య పోటీ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లను పోల్చి.. దేని రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? ఏది కొంటే బెటర్​? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్రారంభ ధర రూ .79,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ .69,999 (ఎక్స్-షోరూమ్). దీని ధర రూ.96,999 (ఎక్స్ షోరూమ్) వరకు వెళుతుంది. కాగా ఓలా ఎస్...