భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రపంచ దేశాలను వణికించిన అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ట్రాఫిక్కర్, మెక్సికో మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్యురా సెర్వాంటెస్ (ఎల్ మెంచో) కథ ముగిసింది! మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలో జరిగిన భారీ సైనిక ఆపరేషన్‌లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచో మరణించినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం విమానంలో మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

గత దశాబ్ద కాలంలో 'ఎల్ మెంచో' తన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్​జీ)ని ఒక ప్రాంతీయ ముఠా నుంచి అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా మార్చాడు. భారీ ఆయుధాలు, సైనిక తరహా కాన్వాయ్‌లు, దారుణమైన హత్యలతో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఇతడి శైలి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఎల్ చాపో' కంటే క్రూరమైన నే...