భారతదేశం, ఏప్రిల్ 19 -- Ekagrah Murthy net worth : ఎఫ్​వై24 క్యూ4 ఫలితాలను తాజాగా వెల్లడించింది దిగ్గజ టెక్​ సంస్థ ఇన్ఫోసిస్​. రిజల్ట్స్​తో పాటు రూ. 28 విలువ చేసే డివిడెండ్​ని కూడా ప్రకటించింది. ఈ వార్తల మధ్య.. ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్​ రోహన్​ మూర్తి ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాడు. ఈ 5 నెలల పసికందు.. సంపద రూ. 4కోట్లు! ఇదెలా సాధ్యమైదంటే..

నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి తనయుడు.. ఈ ఏకాగ్రహ్​ మూర్తి. గతేడాది నవంబర్​లో జన్మించాడు. ఆ పసికందుకు.. ఇన్ఫోసిస్​కి చెందిన 15లక్షల షేర్లను ఇటీవలే గిఫ్ట్​గా ఇచ్చారు నారాయణ మూర్తి. అంటే సంస్థలో 0.04శాతం వాటా! ఈ షేర్ల విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.

ఇక.. ఇన్ఫోసిస్​ ఫలితాలను ప్రకటించినప్పుడే.. రూ. 20 డివిడెండ్​ని ఇస్తున్నట్టు పేర్కొంది సంస్థ. అంతేకాకుండా.. రూ. 8 స్పెషల్​ డ...