భారతదేశం, జనవరి 31 -- Economic Survey 2025: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. భారత జీడీపీ 6.3-6.8 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత 2024 జూలై 22న సమర్పించిన 2022-23 సర్వేతో పోలిస్తే 2025 సర్వే ఆరు నెలల వ్యవధిలో వచ్చింది.

2025 ఆర్థిక సర్వేలోని 10 ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

దేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని కీలక రంగాల ప్రదర్శనకు సంబంధించిన వివణాత్మక విశ్లేషణ ఇచ్చే డాక్యుమెంట్​ ఈ ఎకనామిక సర్వే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్ ఏ- ఆర్థిక పనితీరును అంచనా వేస్తుంది. ఆర్థిక ధోరణులు, స్థూల ఆర్థిక సూచికలను హైలైట్ చేస్తుంది. పార్ట్ బీ- విద్య, పేదరికం, వాతావరణ మార్పు వంటి సామాజిక-ఆర్థిక సమస్యలను విశ్లేషిస్తుంది. అలాగే జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, వాణిజ్యం వంటి కీలక ...