భారతదేశం, ఏప్రిల్ 13 -- భారత్​తో పాటు మయన్మార్​, తజకిస్థాన్​లలో ఆదివారం భూకంపాలు సంభవించాయి. ఇండియాలోని హిమాచల్​ ప్రదేశ్​లో భూమి కంపించింది. అటు భూకంపం ధాటికి మయన్మార్​లోని ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

హిమాచల్​ ప్రదేశ్​లోని మండీ జిల్లాలో ఆదివారం ఉదయం 9:18 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై 3.4 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది.

హిమాచల్​ భూకంపం ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.

సెంట్రల్ మయన్మార్​లోని చిన్న నగరమైన మెక్టిలా సమీపంలో ఆదివారం ఉదయం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మార్చ్​ 28న 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో 3,6...