Hyderabad, డిసెంబర్ 28 -- Prashanth Krishna Dream Catcher Pre Release Event: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు సందీప్ కాకుల తెరకెక్కించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'డ్రీమ్ క్యాచర్' సినిమా జనవరి 3న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్‌తోపాటు ఇతర టెక్నిషియన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. "నాలుగేళ్ల కిందట సందీప్ 'డ్రీమ్ క్యాచర్'సినిమా ఆడిషన్ కోసం పిలిచాడు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే దానికి కారణ...